నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమాతో విడుదలకు సిద్ధంగా ఉన్నారు. అయితే బాలీవుడ్ లో కూడా నాగచైతన్య మొదటిసారి నటించిన "లాల్ సింగ్ చద్దా" సినిమా కూడా విడుదల కాబోతోంది ఈసినిమాలో నాగచైతన్య ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో నాగచైతన్య అమీర్ ఖాన్ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ఇక అమీర్ ఖాన్ తో కలిసి ఉన్న సమయంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని వెల్లడించారు. గత 12 సంవత్సరాలలో నేను ఇండస్ట్రీ లో ఉంటున్నాను అయితే ఇప్పటి వరకు నేర్చుకున్న దానికంటే ఎక్కువగా అమీర్ ఖాన్ దగ్గర కేవలం 50 రోజులలో నేర్చుకున్నానని తెలియజేశారు. అమీర్ ఖాన్ కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి అని తెలియజేశాడు.

ఒక నటుడు జీవితం ఎలా ఉండాలో అనే విషయంపై కూడా చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఒక్కో సినిమాలో ఆయన చూసేది కేవలం కల్పితం మాత్రమే.. మీకు ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి లాభాలను తెచ్చి పెట్టింది అనే విషయాన్ని ఎవడు కూడా పెద్దగా ఆలోచించారు అమీర్ ఖాన్. ఈ విషయం తనకి చాలా బాగా నచ్చిందని నాగచైతన్య తెలిపారు. ఇక అంతే కాకుండా ఏదైనా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అంటే ఆ పాత్రలు ఎలా అయినా నటించడానికి ఎంతగానో కట్టుబడి ఉంటాను అని తెలిపారు. మిగతా విషయాల్లో కూడా అమీర్ ఖాన్  చాలా పట్టు ఉందని అందుకే నేటి తరం నటులకు ఎంతో స్ఫూర్తి ఆయనని నాగచైతన్య తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: