అనిల్ రావిపూడి దర్శకత్వం లో 2019 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిందో మన అందరికీ తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఎఫ్ 2 మూవీ అదిరిపోయే కలెక్షన్ లను సాధించింది. 'యూ ఎస్ ఎ' లో మిలియన్ డాలర్ ల కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో మొట్ట మొదటి సారి మిలియన్ డాలర్ ల కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఇలా ఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ ను ప్లాన్ చేశాడు. తాజాగా ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది.

ఎఫ్ 3 మూవీ విడుదల అయిన మొదటి షో నుండి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. అందులో భాగంగా ఎఫ్ 3 మూవీ తాజాగా 'యు ఎస్ ఎ' లో వన్ మిలియన్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇలా 'ఎఫ్ 3' మూవీ తో మరో సారి వెంకటేష్ 'యు ఎస్ ఎ' లో మిలియన్ డాలర్ ల మార్క్ ను టచ్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: