సినిమా పరిశ్రమలో ఒకే ఒక్క పొరపాటు వారి కెరీర్ ను ఎంతో దెబ్బతీస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోకుంటే వారి కెరీర్ పై ఎంతో ప్రభావం చూపుతాయి. అలా హీరోయిన్ లు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తక్కువ కాలం ఉండే వారి కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోతుంది. అలా చాలామంది హీరోయిన్ లు తప్పుడు నిర్ణయాలు వల్ల కెరీర్ ను మధ్యలోనే వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. లేదా మెల్లమెల్లగా కనుమరుగైపోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఓ హీరోయిన్ చేసిన ఓ తప్పువల్ల ఆమె కెరీర్ మధ్యలో పూర్తయింది.

ఆమె ఎవరో కాదు. అందాల రాక్షసి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందరిని ఎంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. తొలి సినిమా తో తన అందం అభినయం తో అందరిని ఎంతో ఆకట్టుకుంది. తన క్యూట్ క్యూట్ లుక్స్ తో అందరి అలరించిన ఈమె మంచి హీరోయిన్ గానే ఎదిగింది. గ్లామర్ కథానాయికలకు డిమాండ్ ఉందని తెలిసి అప్పటిదాకా సంప్రదాయబద్ధమైన పాత్రలు చేసిన లావణ్య గ్లామర్ ను ధారపోయడం కూడా చేసింది. అయితే ఆమె ఎక్కడ తప్పు చేసిందో తెలీదు కానీ టాప్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

టాప్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం టైర్ 2 హీరోలు సైతం ఆమెవైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే ఆమె కెరీర్ ఇలా అయిపోవడానికి కారణం ఆమె స్టోరీ ల సెలక్షన్ అని కొంతమంది చెప్తున్నారు. అది సరిగ్గా ఉంటె ఆమె కెరీర్ ఇప్పుడు ఇలా ఉండేది కాదని అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటిస్తుంది. హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో ఆమె నటిస్తుండగా ఈ సినిమా విజయం ఆమెకు తప్పనిసరి అయ్యింది. ఈ సినిమా లో నరేష్ ఆగస్త్య వెన్నెల కిశోర్ సత్య ప్రధాన పాత్రలను పోషిస్తుండగా తప్పకుండా ఈ సినిమా హిట్ అయితేనే ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయి. మరి ఆమెకు ఈ సినిమా ఏవిధంగా కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: