మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్ ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించక పోయినప్పటికీ అమీర్ ఖాన్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అలా అమీర్ ఖాన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం ఈయన నటించిన సినిమాలు ఎన్నో తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి విజయాలను సాధించాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్ద' మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యమూవీ లో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ , వియకం 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ఈ ట్రైలర్ విడుదల అయిన  24 గంటల సమయంలో 34 మిలియన్ వ్యూస్ ను , 824 కే లైక్ లను యూట్యూబ్ లో సాధించింది. ఇలా యూట్యూబ్ లో లాల్ సింగ్ చద్ద ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకొని ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే లాల్ సింగ్ చద్ద మూవీ ని  ఆగస్ట్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: