బాక్సాఫీస్ వద్ద ఈ శుక్రవారం పెద్ద యుద్ధమే జరగనుంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు కూడా ఒక దానికి మరొకటి సంబంధం లేని జానర్లే అయినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఛాయిస్ గా ఒకటో రెండో పెట్టుకుంటారు. కాబట్టి వీటిలో గెలుపు ఎవరిది అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. అయితే ఈ మూడు సినిమాల్లో ముందుగా అందరికీ చూపు 'మేజర్' మీదే ఉంది. టాలీవుడ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో గూడచారి ఫేమస్ శశికిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ ఇప్పటికే ఇండియాలో పలుచోట్ల ప్రీమియర్లు జరుపుకుంది. అన్నిచోట్ల నుంచి ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయి. ఈ సినిమాకి మహేష్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక రెండోది విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన 'విక్రమ్'. ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు రూపొందించిన యాక్షన్ డ్రామా లో విజయ్ సేతుపతి,ఫాహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాకి తెలుగులో ఆశించినంత బజ్ లేకపోయినప్పటికీ సినిమా టాక్ ని నమ్ముకొని నిర్మాతలు ధీమాతో ఉన్నారు. ఇక విక్టరీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగనుంది. ఈ సినిమా సుమారు 6 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ఇంత రికవరీ చేయడం కష్టం.

ఎందుకంటే టాలీవుడ్లో కమల్ కి మార్కెట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక మూడో సినిమా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్'. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. యస్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ పీరియాడికల్ మూవీ కి ఎందుకో అంత బజ్ అయితే లేదు. అయితే తాజాగా విడుదలైన భూల్ భూలయ్య 2 సక్సెస్ ని ఈ సినిమా కొనసాగిస్తుందని నమ్మకం అక్కడి ఎగ్జిబిటర్స్ లో కనిపిస్తోంది  కానీ సౌత్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే చాలా నీరసంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి ఈ జూన్ 3న వస్తున్న మేజర్, విక్రమ్, సామ్రాట్ పృథ్విరాజ్ సినిమాల్లో ఎవరు విజేతగా నిలుస్తారు? ఎవరు పరాభవంతో వెనుదిరుగుతారు అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: