టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు సక్సెస్ మీద సక్సెస్ లు కొడుతూ ఫుల్ హిట్ జోష్ లో ఉన్నాడు. ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారంటీ హీరోలలో ఒకరిగా నిలిచిన నాగచైతన్య ఇప్పుడు వరస ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నాడు. ప్రతి ఒక్క హీరో కూడా రెండు లేదా మూడు ప్రాజెక్టులలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తూ ఉండగా నాగచైతన్య కూడా ఇప్పుడు అందరి హీరోల మాదిరిగా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ హీరో చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

 అవి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న నేపథ్యంలో మరి కొన్ని సినిమాలను కూడా ఆయన ఓకే చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజు అనే మూవీ తో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య మరో ఆరు నెలల వ్యవధిలోనే థాంక్యూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు ధూత ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను త్వరలోనే నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలను కూడా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించడం విశేషం.

మరి జూలై 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న థాంక్యూ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. వీటితో పాటే బాలీవుడ్లో ఆయన నటించిన లాల్ సింగ చద్దా సినిమా కూడా ఆగస్టు 11వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ద్వారా ఆయన పాన్ ఇండియా ఇమేజ్ అందుకోవడం ఖాయం అని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల తర్వాత కూడా నాగ చైతన్య కొన్ని సినిమాల్లో నటించడం ఇప్పుడు అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇవే కాకుండా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య. ఆ తరువాత కూడా కొంత మంది క్రేజీ దర్శకులతో కలిసి ఆయన సినిమా చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: