యంగ్ టాలెంటెడ్ హీరోలలో నితిన్ కూడా ఒకరు. తాజాగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజవర్గం. గత ఏడాది రంగ్ దే చిత్రంతో పర్వాలేదు అనిపించుకునీ.. ఆ తర్వాత మాస్ట్రో సినిమాతో ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ఇక దీనితో నిరుత్సాహం చెందిన నితిన్ ఈ సారి ఎలాగైనా గట్టిగా సక్సెస్ అందుకోవాలని సరికొత్త దర్శకుడితో.. మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నారు. నితిన్ ను సరికొత్త గా ఆవిష్కరిస్తున్నారు. ఇందులో నితిన్ ఒక IPS అధికారిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ని శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి ,నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.


ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లూ తెలుస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ బాగా వైరల్ గా మారింది. ఇక ఆ తర్వాత టీజర్ ని విడుదల చేసినా.. ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెంచేశాయి. చాలా రోజుల తర్వాత నితిన్ మళ్లీ సరికొత్త పాత్రలో మాస్ హీరో గా కనిపించబోతున్నట్లు అభిమానులు సైతం ఆనందపడుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ చిల్ మారో అనే సాంగ్ లిరికల్ వీడియో ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటని కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఇక ఈ పాటలో నితిన్ , కేథరిన్  మధ్య బీచ్ నేపథ్యంలో చిత్రీకరించినట్లు గా కనిపిస్తోంది. ఈ పాట ఈ సినిమాకి హైలెట్ గా నిలిచేలా కనిపిస్తోంది. భీష్మ తరువాత మరొకసారి అయితే అదిరిపోయే స్టెప్పులు తో చిల్ అవుతున్నారని చెప్పవచ్చు. ఈ పాటకి కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. ఇక ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తూ ఉంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో నితిన్ గత చిత్రాలకంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్న ట్లు సమాచారం. మరి ఈ చిత్రం తో నైనా ఈసారి అయితే మళ్లీ మాస్ హీరో అనిపించుకుంటా రేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: