టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ అబ్బవరం 'రాజా వారు రాణి గారు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా విడుదల అయిన పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా లభించాయి. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం కొన్ని రోజుల క్రితమే సెబాస్టియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సమ్మతమే , నేను మీకు బాగా కావాల్సిన వాడిని,  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  

ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.  కిరణ్ అబ్బవరం హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న  సినిమా కోసం ఆర్ ఎఫ్ సి లో ఒక మాస్ సాంగ్ చిత్రీకరించడం కోసం కోటి యాభై లక్షలతో భారీ సెట్ ను వేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఇలా కిరణ్ అబ్బవరం సినిమాలోని మా సాంగ్ కోసం సినిమా కోసం అదిరిపోయే భారీ సెట్ ను వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: