మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నా రామ్ చరణ్ తాజాగా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా,  ఈ సినిమాలో కియారా అద్వానీ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ గురించి తాజాగా మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ... తాను రామ్ చరణ్ ను ప్రేమిస్తున్నాను అని , మరియు పెళ్లి చేసుకోకపోతే డేట్ కి వెళ్లడానికి ఇష్టపడతాను అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సామ్రాట్ పృథ్విరాజ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్ 3 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి విజయం బాక్సాఫీస్ దగ్గర లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: