టాలీవుడ్ దర్శకులలో ఒకరు అయిన తరుణ్ భాస్కర్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . పెళ్లి చూపులు మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఇటు ప్రేక్షకుల నుండి ,  అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందు కున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది ఈ మూవీ కి దర్శకత్వం వహించి ఈ సినిమా తో కూడా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు .

ఇలా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్ కొన్ని మూవీ లలో కొన్ని ముఖ్యమైన పాత్రల్లో నటించాడు . అలాగే  కొన్ని టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించాడు .  ఇది ఇలా ఉంటే తాజాగా తరుణ్ భాస్కర్ ఈటీవీ లో ప్రసారం అయిన ఆలీతో సరదాగా ప్రోగ్రాం అతిథిగా విచ్చేశారు . ఈ ప్రోగ్రాం లో భాగంగా తరుణ్ భాస్కర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. అందులో భాగంగా తరుణ్ భాస్కర్  ...  మా కుటుంబం నుంచి ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు అని , నేను షార్ట్ ఫిలింస్ చేస్తూ ఉండేవాడిని అని,  ఏవో కథలు రాస్తూ అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడిని అని ,  ఆ సమయంలో జేబు లో కనీసం పది రూపాయలు కూడా ఉండేవి కావు అని తరుణ్ భాస్కర్ ఈ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు .

ఇది ఇలా ఉంటే తరుణ్ భాస్కర్ తాజాగా ఒక స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలియజేశాడు. అలాగే క్రైమ్ స్టొరీ తో కూడా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తరుణ్ భాస్కర్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: