ప్రస్తుతం బాలీవుడ్ లో అందరి కళ్ళు అక్షయ్ కుమార్ పైనే ఉన్నాయి. కరోనా తర్వాత బాలీవుడ్ లో హిందీ హీరోల చిత్రాలు పెద్దగా రాణించడం లేదనే చెప్పాలి. ఇటీవల ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఏవి ఆశించిన స్థాయిలో అక్కడ లాభాలు తెచ్చి పెట్టలేక పోయాయి. అదీకాక సౌత్ చిత్రాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసి కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఇపుడు సీనియర్ హీరో అక్షయ కుమార్ రంగం లోకి దిగుతున్న నేపథ్యం లో బాలీవుడ్ ప్రేమికుల దృష్టి ఆయన సినిమాపై పడింది. ఈ చిత్రం ఖచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద హిట్ అందిస్తుంది అని ఆసక్తిగా ఉన్నారు.  అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన పథ్వీ రాజ్ సినిమా విడుదలకు రెడీ అయిపోయింది.  దేశ వ్యాప్తంగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది.

కాగా ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పృథ్వీ రాజ్ మూవీ కోసం అక్షయ్ కుమార్‌ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఈ సందర్బంగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చిన అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  దేశం లోని విద్యార్దులకు చరిత్ర గురించి తెలిసేలా  పాఠ్యపుస్తకాల్లో మొగలుల సామ్రాజ్యాలు, వారి యొక్క రాజుల గురించి, వారి వారసత్వం గురించి అనేక పాఠాలు ఉన్నాయి. కాని ఒక్క హిందూ రాజు గురించి ఇక్కడ ఏ తరగతి పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశం లేకపోవడం నిజంగా సిగ్గు చేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొగలుల గురించి గొప్పగా చెప్పారు సరే... వారి చరిత్రలను పిల్లల మెదడులోకి పంపుతున్నారు సరే...కానీ వారి గురించి ఉన్నట్లుగానే హిందూ రాజుల గురించి కూడా ఈతరం పిల్లలకు నేర్పించడం, తెలియచెప్పడం అవసరమే కదా అంటూ అక్షయ్ డిమాండ్‌ చేశారు.

దాంతో ఒక్కసారిగా అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. నిజమే కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు ఆలోచించలేదు అంటూ షాక్ అయ్యారు.  కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా హిందూ రాజులకు సంబంధించిన పాఠ్యాంశాలను తరగతి పుస్తకాల్లో కలపాలి అంటూ డిమాండ్‌ చేశారు. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు ఎందరి మనసుల్లో దాగున్న ప్రశ్న అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ యాంగిల్ లో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి రేపు విడుదల కానున్న పృథ్విరాజ్ సినిమాను సక్సెస్ చేస్తారా లేదా అంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: