ఇటీవలే థియేటర్స్ లో ఏ సినిమా వచ్చినా నెలరోజుల లోనే ఎక్కువగా సినిమాలు ఓటీటీ లో విడుదల అవుతూ వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు అయితే కేవలం 10,15 రోజులలోనే ఓ టి టీ బాట పట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సూపర్ హిట్ మూవీస్ అయిన రాధే శ్యామ్, పుష్ప, ఆచార్య వంటి సినిమాలు కేవలం మూడు వారాలలోనే ఓ టి టీలో నే విడుదలయ్యాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ చిత్రాలు 50 రోజులలో ఓటి టి లో విడుదలయ్యాయి.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సర్కారు వారి పాట సినిమా కూడా ఓటీటీలో త్వరలోనే అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. అది కూడా అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న f-3  సినిమాను కూడా ఓటిటి లో విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ప్రచారం జరుగుతూ ఉండడం తో దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి,  హీరో వెంకటేశ్, వరుణ్ తేజ్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది.


ఈ మేరకు ఒక వీడియో ను విడుదల చేశారు .ఈ వీడియోలో అనిల్ రావిపూడి , వెంకటేశ్ , వరుణ్ తేజ్ కలిసి మాట్లాడుతూ ఈ సినిమా థియేటర్లో చూసి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు అందరికీ థాంక్స్ తెలియజేశారు. అలాగే f3 సినిమా థియేటర్లు చూడకపోయినా నాలుగు వారాలకే ఓ టి టి లో విడుదల అవుతుంది లే అనుకుంటున్నారుగా అని వరుణ్ తేజ్ అనగా.. ఈ సినిమా నాలుగు వారాలలో ఓటిటీలోకి రాధమ్మ.. 8 వారాల తర్వాత వస్తుంది అంటూ వెంకీ తెలియజేశారు  అంటే రెండు నెలల తర్వాత ఓటి టి లోకి వస్తుంది. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను థియేటర్లలో వచ్చి చూడండి అంటూ అనిల్ రావిపూడి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: