ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు కథలను అందించి పాన్ ఇండియా రేంజ్ లో కథారచయితగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. 

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన దాదాపు ప్రతీ సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. అది మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలకు కథలను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇతర భాషా సినిమాలకు కూడా కథలు అందించాడు. అందులో భాగంగా విజయేంద్ర ప్రసాద్ సల్మాన్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన భజరంగీ భాయిజాన్ సినిమాకు కథను అందించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. భజరంగీ భాయిజాన్ సినిమాతో విజయేంద్ర ప్రసాద్ ఇండియా రేంజ్ లో కథారచయితగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇలా కథ రచయిత ఫుల్ సక్సెస్ అయిన విజయేంద్ర ప్రసాద్ కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.

విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమా లలో నాగార్జున హీరోగా స్నేహ హీరోయిన్ గా తెరకెక్కిన రాజన్న సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే కథా రచయితగా , దర్శకుడిగా తనకంటూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ తాజాగా రీమేక్ సినిమాలపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. రాజేంద్ర ప్రసాద్ రీమిక్ సినిమాల గురించి మాట్లాడుతూ...  ఒక రీమేక్ సినిమా కనుక ఇండస్ట్రీలో మంచి విజయం సాధించింది అంటే , అది కేవలం హీరోకు ఉన్న సత్తా...  దమ్ము వల్ల మాత్రమే.  హీరోల స్టార్ డమ్ వలనే రీమేక్ సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయని విజయేంద్ర ప్రసాద్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: