బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్, సూపర్ హిట్, బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న షారుక్ ఖాన్ గత కొద్ది కాలంగా వరుస అపజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు. ఇలా బాక్సాఫీస్ దగ్గర వరుస అపజయాలు దక్కడంతో షారుక్ ఖాన్  కొంత కాలం సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడు. ఇలా సినిమాలకు దూరంగా కొంత కాలం పాటు ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం మాత్రం వరకు పెట్టి సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు. అందులో భాగంగా షారుక్ ఖాన్ ఇప్పటికే పఠాన్ , డంకి సినిమాలను ఓకే  చేసాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా తమిళ క్రేజీ దర్శకులలో ఒకరు ఆయన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  

షారుక్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న  సినిమాకు జవాన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా , ఈ మూవీ కి సంబంధించిన ఒక చిన్న వీడియో గ్లింప్స్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాను 2 జూన్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. తాజాగా జవాన్ చిత్ర బృందం విడుదల చేసిన వీడియో పై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చార్మింగ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇంత భయంకరం గా కనిపిస్తారు అని అనుకోలేదు. ఇది కిల్లర్ అంటూ రామ్ పోతినేని చెప్పుకొచ్చారు.  నీ గురించి చాలా గర్వంగా ఉంది బ్రదర్ అంటూ అట్లీ పై రామ్ పోతినేని ప్రశంసల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: