హీరోయిన్ పూర్ణ కి అటు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకు పెద్దగా గుర్తింపు రాలేదు.  రవిబాబు దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన అవును, అవును 2  సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన పూర్ణ గుర్తింపు సంపాదించుకోలేక పోయింది.  కానీ ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ ద్వారా మాత్రం జడ్జిగా ప్రత్యక్షమైంది అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకుంది.


 ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఒక లైఫ్ ఇస్తే.. ఇక ఢీ షో పూర్ణ కి మరో లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి.  తద్వారా తలైవి, అఖండ, దృశ్యం 2 లాంటి సినిమాలలో కీలకపాత్రలో అవకాశం దక్కించుకుంది పూర్ణ. ఇకపోతే రీసెంట్ గా ఈ అమ్మడు పెళ్లి ఫిక్స్ అయింది అంటూ భర్త ఫోటో కూడా పోస్ట్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక పూర్ణ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు శానీడ్ ఆసిఫ్ అలీ. దీంతో పూర్ణ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అన్న దాని గురించి అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పూర్ణ పెళ్లి చేసుకోబోయే వ్యక్తికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి ఉన్న సంబంధం బయటపడింది.



 ఈయన ఒక పెద్ద బిజినెస్ మాన్ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పౌండర్. ఆయనకు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయట. సెలబ్రిటీలకు ఆయననే వీసాలను కూడా అందిస్తూ ఉంటారట. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ కి ఈయన యూఏఈ వీసా అందించాడట. వీరితో ప్రియమణి లక్ష్మి విజయ్ సేతుపతి శ్వేతామీనన్ లాంటి సెలబ్రిటీలకు ఆయన వీసాలు అందించాడట. అప్పుడు ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పూర్ణ పెళ్లి చేసుకోబోయే అతన్నే అని తెలిసి..  అతని కోసం సెర్చ్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో కూడా ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: