‘బాహుబలి’ తరువాత బాలీవుడ్ లో దక్షిణాది సినిమాల హవా ప్రారంభం అయింది. ఈ సంవత్సరం విడుదలైన ‘కేజీ ఎఫ్ 2’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీల ఘన విజయంతో బాలీవుడ్ క్రేజ్ మసకబారుతోంది. సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ టాప్ హీరోలకు సరైన హిట్ వచ్చి సంవత్సరాలు గడిచిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది.


అక్షయ్ కుమార్ లాంటి సామాజిక చైతన్యం కలిగిన సినిమాలు చేసే హీరోలు ఇమేజ్ కూడ మసకబారిపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో బాలీవుడ్ క్రేజ్ దక్షిణాది సినిమాల హవా మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతుందా అన్నసంకేతాలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో దక్షిణాది ఉత్తరాది అన్న సినిమాలు ఇక ఉండవని రాబోయే సినిమాలు అన్నీ ఇండియన్ సినిమాలు మాత్రమే అంటూ తాను అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా లీకులు ఇచ్చాడు.


ఈవిషయాలు అన్నీ పక్కకు పెడితే ఈవారం పాన్ ఇండియా మూవీలుగా విడుదలైన ‘మేజర్’ ‘విక్రమ్’ ‘పృథ్విరాజ్ మూవీల పోటీలో దక్షిణాది సినిమా రంగానికి చెందిన కమలహాసన్ అడవి శేషు సినిమాలకు వారి నటనకు బాలీవుడ్ లో ప్రశంసలతో పాటు కలక్షన్స్ కూడ వస్తూ ఉండటం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే అక్షయ్ కుమార్ మూవీకి కనీసం మొదటిరోజు కలక్షన్స్ కూడ సంతృప్తిగా లేకపోవడం దక్షిణాది సినిమాల హవాను సూచిస్తుంది.


తమిళనాడులో ‘విక్రమ్’ మూవీకి భారీ కలక్షన్స్ వస్తున్నాయి. ఈమూవీకి మన తెలుగు రాష్ట్రాలలో కూడ మంచి స్పందన వస్తోంది. ఇక ‘మేజర్’ సినిమాను చూసి తెలుగు ప్రేక్షకులు మైమరిచి పోతున్నారు. ఈ రెండు సినిమాలకు ఉత్తరాది రాష్ట్రాలలో కూడ కలక్షన్స్ సంతృప్తికరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 67 సంవత్సరాల కమలహాసన్ నటనకు నేటి తరం ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం చూస్తుంటే మళ్ళీ కమలహాసన్ హవా ప్రారంభం ఐనట్లు అనిపిస్తోంది. ఈ రెండు సినిమాల హడావిడి ఇలా కొనసాగుతుంటే దేశవ్యాప్తంగా విడుదలైన ‘పృథ్విరాజ్’ మూవీకి కనీసపు కలక్షన్స్ కూడ రాకపోవడం చూసిన వారికి బాలీవుడ్ హవా మసకబారుతోందా అనిపించడం సహజం..



మరింత సమాచారం తెలుసుకోండి: