టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్ ఇంకా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే మలయాళీ బ్యూటీ నజ్రియా తెలుగు లో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ ఇంకా మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలకాబోతుంది. తాజాగా ఈ మూవీ దర్శకుడు అయిన వివేక్ ఆత్రేయ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక వివేక్ మాట్లాడుతూ..నాని ఇప్పటివరకూ కూడా ఇలాంటి పాత్రని చేయలేదు. ఇది చాలా డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్రలో చాలా లేయర్స్ అనేవి వుంటాయి. ఇంకా ఫన్ కూడా వుంటుంది. అలాగే దాని వెనుక పెయిన్ వుంటుంది. ప్రతి మాట వెనుక కూడా భిన్నమైన లేయర్ వుంటుంది. ఐతే అవన్నీ లోపల పెట్టుకొని బయటకి మాత్రం ఏమీ కనిపించకుండా మాట్లాడే పాత్ర చేయడం అసలు అంత సులువు కాదు. నాని గారి ఫన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఇందులో ఖచ్చితంగా డిఫరెంట్ నానిని కొత్తగా చూడబోతున్నారు అని అన్నారు.


టీజర్ ఇంకా ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. అలాగే టైటిల్ లో సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. ట్రైలర్ లో ఎమోషన్ ఇంకా ఫన్ చూపించాం.ఇంకా ట్రైలర్ చివర్లో నవ్వుకున్నారు. ఏం జరుగుతుందో అనేది కూడా ఆసక్తి ఏర్పడింది..ఈ సినిమా అంతా కూడా ఇంతే ఆసక్తికరంగా వుంటుంది. ఆ అంటే ఏమిటో అనేదే ఇందులో చాలా కీలకం. అది మీకు కచ్చితంగా బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ పాయింట్ కూడా ఉంది. ఇక ఈజీగా హర్ట్ అయ్యే పాయింట్ అది. ఐతే ఎవరినీ కూడా హర్ట్ చేయకుండా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అని కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీశాం.ఇక సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్’ యూ’ సర్టిఫికేట్ ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇక ఇందులో అభ్యంతరకరమైన అంశాలు వుంటే.. సెన్సార్ క్లీన్ యూ అనేది ఇవ్వదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: