ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రాలలో ఆర్.ఆర్ అర్ సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి ఎంతో అద్భుతంగా ప్రతిభ గా తెరకెక్కించారు. ఇక ఇందులో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై..ప్రపంచ వ్యాప్తంగా భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ లో కూడా సత్తా చాటుతూ బాగా దూసుకుపోతోంది RRR. సినిమా ఈ చిత్రం జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమాలో ఒక సన్నివేశం ఒక అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

ముఖ్యంగా హీరోలు ఇంట్రడక్షన్ సీన్స్ కోసం రాజమౌళి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేసినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సన్నివేశాలలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కూడా ఒకటి.. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో రామ్చరణ్ అద్భుతమైన నటన ప్రదర్శించారు అయితే తాజాగా చిత్రబృందం ఈ సన్నివేశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఈ విషయాన్ని వీడియోని అభిమానులతో పంచుకోవడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రామ్ చరణ్ ఈ సన్నివేశం కోసం ఏకంగా ఒక నెల రోజుల పాటు షూటింగ్ నిర్వహించారని చిత్రబృందం తెలియజేసింది. అంతేకాకుండా ఈ సన్నివేశానికి చేసిన VFX సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ అద్భుతమైన ఫైటింగ్ సీక్వెన్స్ ను ఎలా తెరకెక్కించారు మీరు కూడా ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా లోని మరొక సన్నివేశం ట్రైన్ సన్నివేశాన్ని కూడా ఇలాంటి వీడియో ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇలా సినిమాలకు సంబంధించి పలు వీడియోలను విడుదల చేస్తూ .. వారు పడ్డ కష్టాన్ని కూడా తెలుపుతూ ఉన్నది చిత్రబృందం. ఏదిఏమైనా ఈ క్రెడిట్ అంతా రాజమౌళి కే వెళ్తుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: