మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తన దగ్గర పనిచేసే వారిని సొంత మనుషుల్లా చూసుకోవడంలో మన స్టార్స్ ముందుంటారు. ఈ క్రమంలో రాం చరణ్ తన డ్రైవర్ బర్త్ డే రోజున అతనికి తెలియకుండా కేక్ కట్ చేయించి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తమతో ఎప్పుడూ ఉండే తమ స్టాఫ్ కోసం స్టార్స్ తమ కొద్దిపాటి టైం కేటాయిస్తుంటారు. రాం చరణ్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్న నరేష్ బర్త్ డే సందర్భంగా జరిగిన కేక్ కట్ ప్రోగ్రాం లో ఉపాసనతో సహా చరణ్ కూడా పాల్గొన్నాడని తెలుస్తుంది.

మిగతా స్టాఫ్ తో కలిసి చరణ్ తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ నరేష్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారట. స్టాఫ్ విషయంలో చరణ్ ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాడని.. వారికి ఎలాంటి అవసరం ఉన్నా సరే ఇబ్బంది లేకుండా చేస్తారని తెలుస్తుంది. డ్రైవర్ నరేష్ పుట్టినరోజు సందర్భంగా చరణ్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో తన పర్సనల్ స్టాఫ్ అంతా అటెండ్ అయ్యారని. చరణ్ ఎంట్రీతో డ్రైవర్ బర్త్ డే పార్టీకి కొత్త జోష్ వచ్చిందని అంటున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు చరణ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో సునీల్, శ్రీకాంత్ కూడా నటిస్తున్నారు. శంకర్ మార్క్ సినిమాగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి డైరక్షన్ లో చరణ్ సినిమా ఉంటుందని తెలిసిందే. జెర్సీ హిందీ వర్షన్ రిజల్ట్ తేడా కొట్టినా సరే గౌతం చెప్పిన కథ నచ్చడంతో చరణ్ ఆ సినిమాని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: