నేచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి, ఎన్నో మంచి మంచి క్యారెక్టర్ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ నటుడిగా మంచి స్థానాన్ని ఏర్పరుచు కున్నాడు. ఇలా నటుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న నాని కొన్ని రోజుల క్రితం విడుదల అయిన శ్యామ్ సింగ రాయ్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇలా శ్యామ్ సింగరాయ్ మూవీ తో సక్సెస్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న నాని తాజా గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నాని సరసన నజ్రియా కథానాయికగా నటించింది . ఈ మూవీ ని జూలై 10 వ తేదీన విడుదల చేయబోతున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటం తో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా , ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు నవ్వులను కూడా బాగానే పూయించింది .  

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాని తనకు ఇష్టమైన నటీనటుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. తాజా ఇంటర్వ్యూలో నాని తనకు అమితా బచ్చన్ , విద్యా బాలన్ అంటే చాలా ఇష్టం అని , చాన్స్ వస్తే వారితో ఒక్క సీన్ అయినా నటించాలని ఉంది అని తాజా ఇంటర్వ్యూ లో నాని తెలియ జేశాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: