తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలలో నటించి స్టార్ కమెడియన్ గా  వెలుగు వెలిగిన వారిలో అలీ ఒకరు. అయితే ఈయన 1100కు పైగా తెలుగు సినిమాలలో నటించిన అలీకి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఇకపోతే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని అలీ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక మహమ్మద్ బాషా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలీ కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సహాయం చేస్తున్నారు.అంతేకాకుండా ఈయన సీతాకోకచిలుక అనే సినిమాతో అలీ కెరీర్ మొదలైంది. ఇకపోతే పలు సినిమాలలో అలీ హీరోగా నటించి సత్తా చాటారు.

  ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు కమెడియన్ గా కూడా నటించడంతో అలీకి అవకాశాలు అస్సలు తగ్గలేదు. అయితే పూరీ జగన్నాథ్ సినిమాలలోని పాత్రల ద్వారా అలీ మరింత పాపులర్ అయ్యారు. కాగా ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ అలీ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ఇదిలావుంటే అలీ ఆస్తుల విలువ ఏకంగా 750 కోట్ల రూపాయలు అని సమాచారం.  అయితే ఏడాదికి ఆయన సంపాదన 15 కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తోంది. ఇకపోతే అలీ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు అలీతో సరదాగా షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.కాగా  అలీకి స్టార్ హీరోలందరూ ఇష్టమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మరింత ఎక్కువ అభిమానం అని సమాచారం.

 ఇప్పుడు ప్రస్తుతం అలీ వైసీపీలో ఉన్నారు.అయితే వైసీపీ తరపున అలీకి పదవి దక్కాల్సి ఉండగా నిజంగా పదవి దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ఇక అలీ కెరీర్ లో మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాగా  అలీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకుని సత్తా చాటాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలావుంటే అలీ తాజాగా ఎఫ్3 సినిమాలో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: