టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ హీ రోగా శైలేష్ కోనేరు దర్శకత్వం లో తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిందో మనందరికీ తెలిసిందే. 28 ఫిబ్రవరి 2020 వ తేదీన విడుదల అయిన  సస్పెన్స్ త్రిల్లర్ మూవీ హిట్ ది ఫస్ట్ కేస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా హిట్ ది సెకండ్ కేస్ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ లో అడవి శేషు హీరో గా నటించగా ,ఈ మూవీ కి కూడా శైలేష్ కోనేరు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రావు రమేష్ , పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని 29 జూలై 2022 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయగా, ఈ వీడియో కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హిట్ మూవీ ప్రాంచేజి కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ హిట్ మూవీ ప్రాంచేజి లో మొత్తం 7 మూవీ లు ఉండబోతున్నట్లు ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే హిట్ ది ఫస్ట్ కేస్ లో విశ్వక్ సేన్ హీరో గా నటించగా , హిట్ ది సెకండ్ కేస్ లో అడవి శేష్ హీరోగా నటించాడు. మరి తర్వాత వచ్చే సినిమా లో ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేసు మంచి విజయం సాధించడంతో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: