మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన..ఈ సినిమా హీరోయిన్ గా కృతి శెట్టి పరిచయం అయ్యింది.ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలెదు..మొదటి సినిమా హిట్ అవ్వడంతో హీరో హీరోయిన్లు మంచి ఫామ్ లోకి వచ్చారు.. వీళ్ళతో సినిమా తీయాలని దర్షక నిర్మాతలు క్యూ కడుతున్నారు..ఇప్పటికే ఇద్దరు వరుస సినిమాలను చేస్తూన్నారు.కృతికి మాత్రం అవకాశాలు కాస్త ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల అమ్మడు నటించిన చిత్రం బంగర్రాజు సినిమా మంచి టాక్ ను అందుకుంది.


తెలుగు, తమిళ్‌లో భారీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా కృతికి మరో కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. దాంతో కృతి అక్కడ సీనియర్ హీరోయిన్లకు చెక్ పెట్టేసిందని అంటున్నారు. ఇంతకీ కృతి ఏ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతోంది..ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి టైం నడుస్తోంది. ఉప్పెన సినిమాతో ఆకట్టకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఆఫర్స్ అందుకుంటోంది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్‌ అనిపించుకుంది.



 ప్రస్తుతం ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్లు సైతం ఈర్షపడేలా భారీ ఛాన్స్‌లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. నితిన్ జంటగా ‘మాచర్ల నియోజికవర్గం’.. రామ్ పోతినేని జోడిగా ‘ది వారియర్’ అనే సినిమాల్లో నటిస్తోంది.విలక్షణ దర్శకుడు బాలా-స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాతో.. కృతిశెట్టి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక ఇప్పుడు హీరో ధనుష్‌ సరసన కూడా.. కృతి ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకత్వంలో ధనుష్సినిమా చేయబోతున్నారు...మొత్తానికి ఇటు తెలుగు, తమిళ్ బిజీ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: