జబర్దస్త్ కమెడియన్ ఇంకా నటుడు హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇక ఒక షో జరుగుతుండగానే ఆ షోను ఆపి మరీ ఆదిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు..ఇక ఉదయం షో కు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్ది పట్టించుకోకుండా వచ్చారని, ఆ అమ్మాయి ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉందని తెలుపుతూ ఆదిని అరెస్ట్ చేస్తున్నామని స్టేజిపై వారు రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో అయితే నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇదంతా కూడా ప్రమోషన్ కోసం అని తెలియడంతో నెటిజన్లు బాగా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం హైపర్ ఆది.. ప్రముఖ ఛానెల్ లో వచ్చే ఓ కామెడీ షోలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక వారం వారం వచ్చే ఈ షోలో హైపర్ ఆది మెయిన్ కమెడియన్ అన్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా ఈ షో కు సంబంధించిన ఒక ప్రోమోను యాజమాన్యం రిలీజ్ చేసింది. ఇందులో మొదటి నుంచి వినోదాన్ని పంచిన ఆదికి ట్విస్ట్ ఇస్తున్నట్లు చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడం ఇంకా అతడిని అరెస్ట్ చేస్తున్నామంటూ గోల చేయడం లాంటివి చూపించి ఈ షో పై ఆసక్తి పెంచాలని బాగా ట్రై చేశారు.


ఇక పోలీసులు గా వచ్చినవారు మరింత ఓవర్ యాక్షన్ చేయడం కూడా విశేషం.. అయితే ఇంత చేసినా ఈ ప్రాంక్ జానాలపై మాత్రం ఫలించలేదు.. ఎందుకంటే ఇక్కడే వారు ఒక లాజిక్ ని మిస్ అయ్యారు. అస్సలు హైపర్ ఆదికి అసలు కారు డ్రైవింగే రాదు.. ఈ విషయాన్ని కూడా ఆయన ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పుకొచ్చాడు. మరి కారు డ్రైవింగ్ రాని ఆది ఆ కారు ఎలా నడిపాడు.. యాక్సిడెంట్ ని ఎలా చేశాడు..? ఇంత చిన్న లాజిక్ ను కూడా జనాలు పట్టుకోలేరా..? అని నెటిజన్స్ బాగా విమర్శలు గుప్పిస్తున్నారు. మీ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా కూడా చేస్తారా..? మొన్నటికి మొన్న ఇమ్మానుయేలు, పూర్ణను అసభ్యంగా తాకాడని ఆమె సీరియస్ అవ్వడం, స్టేజిపై కొట్టడం లాంటివి చూపించి రచ్చ రచ్చ చేశారు.. ఇక ఈ వారం ఇలా.. ఇదంతా కూడా మీ టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడం కోసమేగా.. ఒక బ్రాండ్ ఉన్న ఛానెల్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే ని చేయడం అస్సలు బాగోలేదని నెటిజన్స్ తిడుతూ అనేక రకాల కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: