రాజ్ కమల్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ ఇతర పాత్రల్లో నటించిన తాజా సినిమా విక్రమ్ హిట్లిస్ట్. యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మొన్న ప్రేక్షకుల ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే.
కమల్ హాసన్ రా ఏజెంట్ గా నటించిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాక విడుదలైన అన్ని భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం అన్ని చోట్ల నుండి సూపర్ రెస్పాన్స్ తో పాటు భారీ స్థాయి కలెక్షన్స్ కూడా కొల్లగొడుతూ దూసుకెళ్తున్న విక్రమ్ మూవీ పై అటు ప్రేక్షకాభిమానుల తో పాటు ఇటు పలువురు సినిమా ప్రముఖులు సైతం విశేషంగా పొగడ్తలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ తమ సినిమాని ఇంతగా ఆదరిస్తున్నందుకు నిన్న మధ్యాహ్నం వీడియో బైట్ ద్వారా హీరో కమల్ హాసన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా రేసి స్క్రీన్ ప్లే తో పాటు అండర్ కరెంట్ గా స్టోరీ ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ నడిపిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో ఒక చిన్న క్యామియో పాత్ర చేసిన సూర్య గురించి ప్రేక్షకాభిమానూలు అందరూ కూడా ఎంతగానో మాట్లాడుకుంటున్నారు. చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ కూడా ఆ కొన్ని క్షణాల పాత్రలో తన అత్యద్భుత నటనతో అందరిని ఎంతో ఆకట్టుకున్నారు సూర్య. ఇక అతి త్వరలో ప్రారంభం కానున్న విక్రమ్ మూవీ సీక్వెల్ లో సూర్య పాత్ర కూడా పూర్తి స్థాయిలో ఉండనుంది. ఆ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు టాక్. కాగా విక్రమ్ సీక్వెల్ పై అందరిలో మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: