విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి 2019 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఎఫ్ 2 మూవీ ఎంత పెద్ద విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించిందో మన అందరికీ తెలిసిందే.

అలా ఎఫ్ 2 మూవీ మంచి విజయం సాధించడంతో ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు. ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ఎఫ్ 3 మూవీ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండటం , అలాగే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 63.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఎఫ్ 3 మూవీ 64.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది. మొదటి వారం రోజుల పాటు ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కగా,  ఆ తరువాత వారం నుండి ఈ సినిమాకు మేజర్ , విక్రమ్ మూవీ ల నుండి గట్టి పోటీ ఎదురవడంతో ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గాయి.  

12 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా 52.54 కోట్ల షేర్  , 88.06 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఫార్ముల ను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 11.96 కోట్ల కలెక్షన్ లను సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: