తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు కేవలం సినిమాలలో హీరోలుగా మాత్రమే కాదు ఇతరవ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. అలా వారు రెండు చేతు ల సంపాదిస్తున్నారు.ఇంకా కొంతమంది హీరోలు సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్నారు కూడా ఇంకా కొంతమంది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టుకుని సినిమాలను పంపిణీ చేస్తున్నరు. అలా నితిన్ హీరోగా ఇటు పంపిణీదారుడిగా సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతుండడం విశేషం.

శ్రేష్ మూవీస్ బ్యానర్ పై అయన సినిమాలు నిర్మిస్తూ సినిమాలను కూడా పంపిణీ చేస్తూ ఉంటాడు అలా ఇటీవలే కమల్ హాసన్ నటించిన సినిమా ను తెలుగు లో డిస్ట్రిబ్యూషన్ చేశాడు నితిన్. నితిన్ తండ్రి ఈ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా ఈ సినిమా ను డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో నితిన్ హ్యాండ్ ఎంతో ఉంది. అలా ఈ సినిమా ను వారు తెలుగు లో విడుదల చేయడం అది సూపర్ హిట్ అవడం వారికి కలెక్షన్స్ ల వర్షం కురిపిస్తుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకె క్కిన ఈ సినిమా యాక్షన్ ప్రేమికులను ఎంతో అలరిస్తుంది.

సినిమా లో కమల్ హాసన్ మెయిన్ హీరోగా నటించగా ఆయనతోపాటు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ నటించాడు. చిరవర్లో వచ్చిన సూర్య సినిమా హిట్ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా తరువాతి భాగంపై అందరు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. పలుభాషల్లో విడుదల అయిన ఈ సినిమా తెలుగు లో మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది. తన సినిమాల పరంగా ఆకట్టుకొని నితిన్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరి ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూద్దాం.ఇప్పటికే ఈ సినిమా వందకోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: