కరోనా ఏమని వచ్చింది కానీ ఇది బాలీవుడ్ పరిశ్రమకు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే కరోనా ముందు, కరోనా తరవాత అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగ్ లు ఆగిపోవడం ఆ తరవాత మళ్లీ లాక్ డౌన్ తొలగించాక తిరిగి షూటింగ్ ప్రారంభించి అన్ని ఇండస్ట్రీలో వేగాన్ని పుంజుకున్నాయి. అయితే కరోనా తరవాత సౌత్ ఇండియన్ చిత్రాలు బ్యాండ్ బాజా బారాత్ అంటూ వరుసగా పలు చిత్రాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఎఫెక్ట్ బాలీవుడ్ పై భారీగా పడిందనే చెప్పాలి. అక్కడ సౌత్ చిత్రాలకు ఈ మధ్య ఎనలేని ఆదరణ అందుతోంది. అక్కడి హీరోల చిత్రాలను పక్కన పెట్టి మరి సౌత్ హీరోల సినిమాలకు ఓటేసి గెలిపిస్తున్నారు హిందీ ప్రేక్షకులు.

కంటెంట్ లేకుంటే మన భాష అన్న మాట కూడా మరచిపోతాం అని స్వీట్ వార్నింగ్ లు చెప్పకనే ఇచ్చేస్తున్నారు.
అంతే కాకుండా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ భారీ అంచనాల నడుమ విడుదల అయిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఏదో ఒకటి రెండు తప్ప ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకున్న చిత్రాలు తక్కువే. అలా బాలీవుడ్ ఇండస్ట్రీ ఆర్ధిక ఇబ్బందులు అలాగే ఇండస్ట్రీ రెపిటేషన్  ఇలా ఈ రెండింటి నడుమ నలిగి పోతుంది. సౌత్ చిత్రాలు కొన్ని అక్కడ కూడా ఘన విజయాలను అందుకోవడం కరోనా కష్టాల నుండి, ఈ మధ్య కొన్ని హిందీ సినిమాలు మిగిల్చిన నష్టాల నుండి గట్టెక్కారు.  కాగా సరైన సక్సెస్ కోసం మళ్ళీ బాలీవుడ్ ఇండస్ట్రీ బడా అని నిలిపేందుకు గానూ గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.

కాగ ఈ క్రమంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తన చిత్రం పృధ్వీ రాజ్ సినిమాపై  అంతా హోప్స్ పెట్టుకున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుని ఆశలు నీరుగార్చింది. బాలీవుడ్ సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ..  ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతున్న  సమయంలో ఈ సినిమా విడుదల కావడం మరో ప్రతికూలంగా మారింది. డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నప్పటికీ ఒక స్టార్ హీరో ఇమేజ్ కి అవి సరిపోవని వాపోతున్నారు హిందీ ట్రేడ్ వర్గాలు. ఏదేమైనా ఈ సారి కూడా మళ్ళీ నిరాశే ఎదురయ్యింది. తిరిగి మళ్ళీ ఏ హీరో లు బాలీవుడ్ ఇండస్ట్రీ వేగాన్ని పుంజుకునేలా చేస్తారో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: