ఒకప్పుడు గ్లామర్ విషయంలో బాలీవుడ్ భామలే ముందంజలో ఉండేవారు. అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనలో వాళ్లని మించిన వారు లేరన్నట్టు వాళ్ల హాట్ షో ఉండేది. అయితే రోజులు మారుతున్నా కొద్ది అక్కడ హీరోయిన్సే మన దగ్గరకు రావడంతో హాట్ షో విషయంలో సౌత్ హీరోయిన్స్ కూడా పెద్దగా అడ్డు చెప్పట్లేదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ భామలకు ధీటుగా వాళ్లని మించి గ్లామర్ షో చేసేస్తున్నారు.

ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్ బీ టౌన్ బ్యూటీస్ కూడా చెమటలు పట్టించేలా గ్లామర్ షో చేస్తున్నారు. ఫోటో షూట్ అంటే చాలు బికిని ఫోజులకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు తెలుగు హీరోయిన్స్ గ్లామర్ షో విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండేవారు కానీ ఇప్పుడు మీడియా పెరిగే సరికి వాళ్లకి బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి. మడి కట్టుకు కూర్చుంటే సరిపోదని వాళ్లు కూడా గ్లామర్ షోలో దుమ్ముదులిపేస్తున్నారు.

తెలుగు భామల్లో ఈ స్కిన్ షోలో దూకుడు చూపిస్తున్న భామల్లో సమంత ఆ వరుసలో రష్మిక మందన్న ఉంది. ఆఫ్టర్ డైవర్స్ తనకు తిరుగు లేదు.. తనని ఆపే వారే లేరు అన్నంతగా సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. సమంత చేస్తున్న ఈ హాట్ షోకి ఆమె ఫ్యాన్స్ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఓ పక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ ఫోటో షూట్స్ తో మాత్రం అదరగొట్టేస్తుంది సమంత. ఇక మరోపక్క రష్మిక మందన్న కూడా బాలీవుడ్ లో రెండు అవకాశాలు వచ్చే సరికి అమ్మడు ఎక్కడ తగ్గట్లేదు. ఫోటో షూట్ అంటే చాలు అందాలను గుమ్మరించేస్తుంది రష్మిక. ప్రస్తుతం బాలీవుడ్ భామలు కూడా సమంత, రష్మిక హాట్ షో గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. సమంత కూడా బాలీవుడ్ లో వరుస వెబ్ సీరీస్ లకు ఓకే చెబుతుంది. ఈ గ్లామర్ షో అక్కడ బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: