నందమూరి నట సింహం బాలకృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. జూన్ 10న బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఒకటి కాదు రెండు అదిరిపోయే అప్డేట్స్ రాబోతున్నాయి. అఖండతో తన బాక్సాఫీస్ దగ్గర తన దమ్ము చూపించిన బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ 107 సినిమాని దానికి మించి సినిమా అనిపించేలా చేయాలని చూస్తున్నాడు.

అందుకే బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా టైటిల్ పోస్టర్ తో పాటుగా ఫస్ట్ లుక్ టీజర్ కూడా వదలనున్నారని తెలుస్తుంది. మరోపక్క నందమూరి ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ ఇచ్చేలా బాలయ్య 108వ సినిమా అప్డేట్ కూడా వస్తుందని తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ ఆవిపుడి డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలిసిందే. పటాస్ నుండి ఎఫ్3 వరకు ఓటమి లేని డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి డైరక్షన్ లో బాలయ్య బాబు సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎక్సయిటింగ్ మొదలైంది.

అసలైతే బాలకృష్ణ 100వ సినిమానే అనీల్ రావిపుడి డైరక్షన్ లో రావాల్సి ఉంది. కానీ ఆ టైం లో ఆ సినిమా చేయడం కుదరలేదు. అయితే అనీల్ వరుస సక్సెస్ లను చూసి బాలయ్య ఈసారి సినిమా చేసేద్దాం అన్నారు. బాలయ్య 108వ సినిమా అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకు సంబందించిన క్రేజీ అప్డేట్ కూడా బాలకృష్ణ బర్త్ డే జూన్ 10న రాబోతుందని తెలుస్తుంది. ఈ రెండు అప్డేట్స్ తో నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య పుట్టినరోజు పండుగ జరుపుకునేలా చేస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: