బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ పై రౌడె షీటర్ దాడి ప్రయత్నం ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వీజే సన్నీ వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నాడు. ఆల్రెడీ ఒక సినిమా సెట్స్ మీద ఉండగా ఈమధ్యనే హరీష్ శంకర్, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఏ.టి.ఎం అనే వెబ్ సీరీస్ కూడా మొదలైంది. ఈ వెబ్ సీరీస్ షూటింగ్ టైం లోనే ఓ రౌడీ షీటర్ సన్నీ పై దాడి చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే వెంటనే చిత్రయూనిట్ అలర్ట్ అవడంతో అక్కడ నుండి సన్నీని కారులో పంపించేశారట.

ఈమధ్య బాగా ఫేమస్ అయిన వ్యక్తులని డిస్ట్రబ్ చేస్తే బాగా పాపులర్ అవ్వొచ్చు అన్న కారణంతో కొందరు వ్యక్తులు ఇలా చేస్తున్నారు. అయితే సన్నీ పై దాడికి ప్రయత్నించిన ఆ రౌడీ షీటర్ ఎవరు. అతని వివరాలు ఏంటన్నది మాత్రం బయటకు రావాల్సి ఉంది. సన్నీ మాత్రం ఈ ఘటనపై షాకింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 లో తన ఎనర్జిటిక్ టాలెంట్ తో కోట్ల మంది ప్రేక్షకులను అలరించి టైటిల్ గెలిచాడు సన్నీ.

అలాంటి సన్నీ ఇప్పుడిప్పుడే కెరియర్ లో ఎదుగుతున్న టైం లో ఇలా రౌడీ షీటర్ తో దాడి చేయించడం అనేది ఏమాత్రం సహించలేని విషయం. అతనిపై దాడి చేసింది ఎవరు. ఏ కారణాల చేత సన్నీ పై దాడి చేశారు. వారితో సన్నీకి ఉన్న వైరం ఏంటి. అసలు సన్నీపై ఎందుకు దాడి చేయాలని అనుకున్నారు లాంటి విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మీడియా కూడా చాలా అలర్ట్ గా ఉన్నారని తెలుస్తుంది. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 5 హౌజ్ మెట్ ఆర్జే కాజల్ తో లైవ్ లో పాల్గొన్నారు సన్నీ. అతనితో పాటు సీరియల్ షూటింగ్ లో ఉన్న మానస్ కూడా ఈ లైవ్ లో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: