ప్రస్తుతం తెలుగు ,తమిళ భాషలలో బాగా పేరు పొందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అనిరుధ్ అని చెప్పవచ్చు. ఈయన అందించిన తాజా చిత్రాలు విక్రమ్ బెస్ట్ సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. దీంతో మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే తాజాగా కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ - 30 వ చిత్రంలో నటిస్తున్న ఈ సినిమాకు కూడా ఈయనినే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేయడం గమనార్హం. అయితే అనిరుధ్ ప్రముఖ సింగర్ జోనిత గాంధీతో ప్రేమలో ఉన్నారని వార్త కోలీవుడ్ మీడియా నుంచి బాగా వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా జోనిత గాంధీ సింగర్ గా చాలా బిజీగా ఉన్నది. బీస్ట్ సినిమాలో హాలమత్తి హబీబ్ అనే సాంగును పాడింది.


అనిరుధ్ గతంలో లో పలువురు హీరోయిన్ల తో డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా బాగా వినిపించాయి. ఇప్పుడు తాజాగా జోనిత గాంధీ తో ప్రేమ లో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు సైతం చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా జోనిత గాంధీ అవార్డు ఫంక్షన్ లో పాల్గొనడం జరిగింది. ఇందులో ఈమెకు యాంకర్ కిల్.. మ్యారి కిస్ అనే ఆప్షన్ను ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన ఆప్షన్లలో సూర్య , అనిరుధ్, రణవీర్ సింగ్ లలో ఎవరిని వివాహం చేసుకుంటానని అడగగా .. అందుకు జోనిత గాంధీ ఈ విధంగా చెప్పడం జరిగింది.

జోనిత గాంధీ మాట్లాడుతూ అనిరుధ్ పేరును తెలియజేయడం జరిగింది. దీంతో ఇప్పటికీ అనిరుధ్ , జోనిత గాంధీ ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి వైరల్ గా మారుతున్న ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరు స్పందిస్తారో చూడాలి. జోనిత గాంధీ సరదాగా చెప్పిందా లేక సీరియస్గానే చెప్పిందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో సతమతమయ్యే లా చేస్తోంది. అయితే రాబోయే రోజులలో వీరిద్దరూ ఒకటవుతారు ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: