ప్రస్తుతం వరస హిట్లతో దూసుకుపోతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఇకపోతే తాజాగా ఈయన  దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇక  ఈ విషయాన్ని ఎఫ్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.అయితే అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది...అంతేకాదు  ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. పొతే బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నామని అనిల్ రావిపూడి తెలిపారు. అంతేకాకుండా ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం గురించి టైటిల్ అంటూ ఒకటి బయిటకు వచ్చింది.ఇక  ఆ సినిమాకు టైటిల్ గా బ్రో ఐ డోంట్ కేర్....అని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అనీల్ రావిపూడి రాసుకున్న కథకు ఈ టైటిల్ ఫెరఫెక్ట్ అని చెప్తున్నారు.పోగా ఈ సినిమాకు మొదట  ఐ డోంట్ కేర్ అని అనుకున్నారట.ఇక ఆ తర్వాత 'Bro' అని యాడ్ చేసినట్లు చెప్తన్నారు. తాజాగా  ఇప్పుడు  ఈ టైటిల్ జనాల్లోకి బాగా వెళ్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే `సెప్టెంబర్- అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్తాం.కాగా  షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణం.అయితే బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే సినిమా ఉంటుంది.

ఇకపోతే  ఫన్ ఉంటుంది కానీ అంత బిగ్గర్ గా ఉండదు. కాగా ఇందులో నాతో పాటు బాలయ్యను కూడా కొత్తగా చూస్తారు. అయితే మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం.అంతేకాదు ` అని అనిల్ రావిపూడి చెప్పడంతో వీరి కాంబో ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.అయితే అనిల్ రావిపూడి - బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇదిలావుంటే ఈ మూవీ కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. ఇక ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: