దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'ఆర్ ఆర్ ఆర్' థియేటర్ లలో ఏ రేంజ్ ప్రభంజనాన్ని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టి అదిరిపోయే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకుంది.

ఈ భారీ బ్లాక్ బస్టర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా ఆలియా భట్, ఒలివియా మెమోరీస్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ , శ్రేయ , సముద్ర కని ముఖ్య పాత్రల్లో నటించగా , ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించారు.  ఇది ఇలా ఉంటే థియేటర్ లలో  ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకొని  బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కొన్ని రోజుల నుండే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతుంది.  

తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషలకు సంబంధించిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ  ప్రముఖ 'ఓ టి టి' జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుండగా,  హిందీ వెర్షన్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రముఖ 'ఓ టి టి' నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రెండు వారాల పాటు ఆంగ్లేతర చిత్రాల విభాగంలో #1 ట్రెండింగ్ లో కొనసాగిన ఏకైక చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' రికార్డు సృష్టించింది. అలాగే ఎనిమిది దేశాల్లో #1 మూవీ గా , 54 దేశాల్లో లో టాప్ టెన్ లో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ నిలిచింది ఇలా థియేటర్ లలో ప్రభంజనం సృష్టించిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఇప్పుడు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: