ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర విడుదలైన మొదటి షో కే పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే ఆ సినిమాలకు అదిరిపోయే  కలెక్షన్ లు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మొదటి వారం రోజులు మంచి కలెక్షన్ లను సాధిస్తూ ఉంటాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలు 2022 వ సంవత్సరంలో మొదటి వీక్ ఎండ్ పూర్తయ్యేసరికి అదిరిపోయే కలెక్షన్లను సాధించాయి. 2022 వ సంవత్సరంలో మొదటి వీక్ ఎండ్ అయ్యేసరికి హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన నాలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ నాలుగు రోజులు పూర్తయ్యే సరికి 563 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.


ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ మూడు రోజులకు 500 కోట్ల కలెక్షన్ లను సాధించింది.


బీస్ట్ : తలపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ 5 రోజులు పూర్తయ్యే సరికి 192 కోట్ల కలెక్షన్ లను సాధించింది.


విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా మొదటి మూడు రోజులు పూర్తయ్యే సరికి 165 కోట్ల కలెక్షన్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kgf