2022 వ సంవత్సరంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. అలా విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉండటంతో ఆ సినిమాలు అతి తక్కువ రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాయి. అలా ఇప్పటివరకు 2022 వ సంవత్సరంలో విడుదల అయ్యి అత్యధిక తక్కువ సమయంలో 100 కోట్ల వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించిన 6 సౌత్ ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ విడుదలైన మొదటి రోజే 100  కోట్ల కలెక్షన్లను సాధించింది.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల అయిన మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.


రాధే శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ విడుదలయిన రెండు రోజులకు 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.


సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయిన రెండు రోజులకు 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.


బీస్ట్ : విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  బీస్ట్ మూవీ విడుదల అయిన 2 రోజులకు 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.


విక్రమ్ : కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం
లో తెరకెక్కిన విక్రమ్ మూవీ విడుదల అయిన రెండు రోజులకు 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: