ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ కూడా ఒకేసారి రెండేసి మూడేసి సినిమాలు చేస్తున్నారు. రాత్రీపగలూ షూట్ చేస్తూ సినిమాలు చేయడం లో మునిగిపోతున్నారు. చిన్న హీరో లు సైతం వరుస సినిమాలు ఒప్పుకుంటుంటే పెద్ద హీరో లు ఏకంగా అరడజను సినిమాలను ఒప్పుకుంటున్నారు. అలా కొంతమం ది పెద్ద హీరోలు సడెన్ గా ఖాళీగా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు షూటింగ్ లు చేయకుండా ఖాళీగా ఉన్నారు.

మంచి హిట్స్ తో జోష్ మీద ఉన్న వీరు ఇప్పటికే పలు చిత్రాలకు కమిట్ అయ్యారు. అయితే ఆ సినిమాలు షూటింగ్ మొదలు పెట్టుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తో సూపర్ హిట్ కొట్టగా త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టడం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. జు లై లో ఈ సినిమా మొదలుపెట్టబోతున్నాడని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలోని హరిహరవీరమల్లు సినిమా తదుపరి షెడ్యూల్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నాడు.

అంతేకాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలోని భవదీయుడు భగత్ సింగ్ సినిమా ను తొందరలోనే మొదలుపెట్టబోతు న్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తుండగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా మన పెద్ద హీరోలందరూ తమ చివరి సినిమాలతో బాక్సా ఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఇప్పుడు మరోసారి భారీ విజయాన్ని సాధించడానికి ముందడుగులు వేస్తున్నారు. తొందరలోనే వీరు ఆయా సినిమాల షూటింగ్ లలో పాల్గొనబోతు న్నారు. మరి ఆ సినిమాలతో వీరు హిట్ జోష్ ను కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారా అనేది చూడాలి. వచ్చే నెలలోనే చాలామంది పెద్ద హీరోల సినిమాలు మొదలు కాబోతునాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: