అఖండతో సంచలనం సృష్టించిన నందన్మూరి నట సిం హం బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 107వ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టీజ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు రానుంది. జూన్ 10 బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా బాలయ్య 107వ టీజర్ రానుంది. క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణతో అంతకుమించి అనిపించేలా సినిమా చేస్తున్నాడట.

ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే టీజర్ 60 సెకన్ల పాటు ఉంటుందని తెలుస్తుంది. టీజర్ మొత్తం మాస్ అంశాలతో ఉంటుందని. సినిమా రేంజ్ ఏంటన్నది ఈ 1 మినిట్ టీజర్ లోనే చూపించబోతున్నారట. టీజర్ తోనే అరాచకం చూపించాలని ఫిక్స్ అయ్యారట చిత్రయూనిట్. సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖండతో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఈ సినిమాకు స్పీషల్ ఇంట్రెస్ట్ తో మ్యూజిక్ ఇస్తున్నాడట.

టీజర్ లోనే థమన్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అన్నది చూపించబోతున్నారని తెలుస్తుంది. బాలయ్య, గోపీచంద్ మలినేని ఈ కాంబో సినిమా తప్పకుండా ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు. అఖండ తర్వాత బాలయ్య పర్ఫెక్ట్ సినిమా చేస్తున్నారని చిత్రయూనిట్ చెబుతున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో కానీ 2023 సంక్రాంతి రేసులో కానీఎ దించాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ 108వ సినిమా సూపర్ హిట్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. ఆ టైటిల్ ని కూడా బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా రివీల్ చేస్తారని టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: