నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విషయంలో అంతా పాజిటివ్ బజ్ నడుస్తుంది. నాని శ్యాం సింగ రాయ్ తర్వాత మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అని అంటున్నారు. నాని సరసన నజ్రియా నటించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పుకుంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్ అంచనాలను తగినట్టుగానే ఉంటుందని అంటున్నారు.

రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను బాగా తీశాడని చెబుతున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో హిట్ అందుకున్న డైరక్టర్ వివేక్ ఆత్రేయ ఈసారి నానితో అంటే సుందరనికీ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా నిర్మాతలు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ డైరక్టర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే సుందరానికీ అనుకున్న రేంజ్ లో హిట్ పడితే అతనికి స్టార్ హీరో డైరక్షన్ ఛాన్స్ ఇస్తారని టాక్.

కథ రెడీ చేసుకుని.. ఏ హీరో అన్నది చెబితే ఆ హీరో దగ్గరకు డైరక్టర్ వివేక్ ని తీసుకెళ్లి కూర్చోబెడతామన్ హామీ ఇచ్చారట మైత్రి నిర్మాతలు. ఓ రకంగా వివేక్ ఆత్రేయ లాంటి యంగ్ డైరక్టర్ కి ఇదో పెద్ద ఆఫర్ అని చెప్పొచ్చు. డైరక్టర్ యంగ్ అయినా టాలెంట్ మాత్రం బోల్డేంత ఉందని ఆల్రెడీ అంతకుముందు వచ్చిన రెండు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. తప్పకుండా అంటే సుందరానికీ సినిమాతో హిట్ కొట్టి స్టార్ హీరో ఛాన్స్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు వివేక్ ఆత్రేయ. టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నారు. వివేక్ అదిరిపోయే కథ రాస్తే మాత్రం హీరో ఎవరైనా సరే మైత్రి మూవీస్ వారు ఒప్పించే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: