నిన్న ఉదయం 10.24 నిమిషాలకు అత్యంత ఘనంగా నయనతార పెళ్ళి జరిగింది. తనకన్నా వయసులో చిన్నవాడైన విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న నయనతార పెళ్ళి చివరివరకు సస్పెన్స్ మూవీలా కొనసాగింది. ఇప్పటికే నయనతార శింభూ ప్రభుదేవా లతో పెళ్ళి పీటల వరకు వెళ్ళి ఆఖరి నిముషంలో యూటర్న్ తీసుకున్న నయనతార విగ్నేష్ శివన్ తో కూడ అలాగే వ్యవహరిస్తుందా లేదంటే పెళ్ళి చేసుకుని తన కెరియర్ ను కొనసాగిస్తుందా అన్న సస్పెన్స్ కు నిన్నటితో తెరపడింది.


తన ప్రియుడు విగ్నేష్ శివన్ కోసం తన మతం మార్చుకుని హిందూ వైదిక పద్ధతిలో నయన్ పెళ్ళి అత్యంత ఘనంగా జరిగింది. పెళ్ళి తంతు పూర్తికాగానే పెళ్ళి వేదిక నుండి కిందకు దిగి వచ్చి తన పెళ్ళికి అతిధిగా వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు పాద నమస్కారం చేసి తన భక్తిని చాటుకుంది.


నయనతారకు అంతగా ఇమేజ్ లేని రోజులలో రజినీకాంత్ పట్టుబట్టి ఆమెకు ‘చంద్రముఖి’ మూవీలో హీరోయిన్ అవకాశం ఇప్పించడంతో ఆమె దశ తిరిగి సుమారు 15 సంవత్సరాలుగా లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాది సినిమా రంగాన్ని ఏలుతోంది. ఈ పెళ్ళికి బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ తమిళ హీరో విజయ్ మణి రత్నం సూర్య జ్యోతిక లతో పాటు అనేకమంది ఫిలిం సెలెబ్రెటీలు ఆమె వివాహానికి ప్రత్యేక అతిధులుగా రావడంతో మీడియా కెమెరాలకు విపరీతంగా పని పట్టింది.


ఆమె పెళ్ళి తంతును తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక స్పెషల్ వీడియోగ తీయించి నెట్ ఫ్లిక్స్ సంస్థకు కోట్ల రూపాయల కోట్ల రూపాయల భారీ మొత్తానికి తన పెళ్ళి రైట్స్ ను అమ్మడం ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక హీరోయిన్ పెళ్ళికి తమిళనాడు ఇండస్ట్రీ ప్రముఖులు అంతా రావడంతో పాటు తన పెళ్ళి సందర్భంగా తమిళనాడు లోని వివిధ పట్టణాలలో ఉన్న పేదలకు సుమారు లక్ష మందికి అన్నదానం చేయడం హాట్ న్యూస్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: