పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మరొక మూవీ కి సంబంధించి అప్డేట్ ఇప్పటికే వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరి కలయికలో ఈ చిత్రాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇకపోతే గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి చేసిన ప్రకటన ఇప్పటివరకు సెట్ మీదకు వెళ్లే లేదనే చెప్పాలి. ఇక ఈ గ్యాప్లో సినిమాపై రోజుకో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఇక తాజాగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించబోతున్నారు అనే పేరు వచ్చింది. హరీష్ శంకర్ అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ఇటీవల సల్మాన్ ఖాన్ ను కలిసి దిగిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా దాన్ని ఒక రూమర్ లా స్ప్రెడ్ చేశారు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి తో హరీష్ శంకర్ గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో చూపించబోతున్నారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు ఒక రూమర్  బాగా స్ప్రెడ్ చేశారు. భవదీయుడు భగత్సింగ్ సినిమాకి కూడా సల్మాన్ ఖాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని ఒక వెబ్ పోర్టల్ ఎక్స్క్లూజివ్ అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వార్త కాస్త హరీష్ దగ్గరికి వెళ్లడంతో ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు.


ఇది నిజం కాదు సార్.. నేను అన్ని సమయాలలో అందరికీ అందుబాటులో ఉంటాను.. దయచేసి మీరు ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒక్కసారి నాతో ఒక మాట చెప్పండి అని హరీష్ ట్వీట్ ద్వారా తెలుపుతూ హరీష్ శంకర్ రూమర్స్ కి చెక్ పెట్టారు. భవదీయుడు భగత్ సింగ్ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని , రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: