లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమా లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్ కీలకమైన పాత్రలలో నటించగా , సూర్య గెస్ట్ రోల్ లో కనిపించాడు .

హేమాహేమీలు అయిన నటీనటులు ఈ సినిమా లో నటించడం , మానగరం, ఖైదీ, మాస్టర్ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి . ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాకు అదిరిపోయే బ్లాక్బస్టర్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సూర్య ఈ మూవీలో ఆఖరున అతి తక్కువ సమయమే కనిపించినప్పటికీ ఆ పాత్ర తో సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చాడు.  ఇది ఇలా ఉంటే సూర్య సినిమాలో కనిపించేది తక్కువ సమయమే కాబట్టి అందుకోసం సూర్య ఈ మూవీకి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. సూర్య 'విక్రమ్' సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రను చేసిన సూర్య కు కమల్ హాసన్ రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.

అయితే  కమల్ హాసన్  ,సూర్య  కు గిఫ్ట్ గా ఇచ్చిన రోలెక్స్ వాచ్ ఖరీదు దాదాపు 10 లక్షల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజు ఒక కారు గిఫ్టుగా ఇచ్చాడు. అలాగే 13మంది అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు అపాచీ ఆర్ టీఆర్  160 మోటార్ బైక్‌లను కూడా అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: