దర్శకుడు హరీష్ శంకర్ ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కామెంట్స్ వెనుక అర్థాలు ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పవన్ అభిమానులు కోరుకునే విధంగా ‘గబ్బర్ సింగ్ ను తీర్చిదిద్దిన హరీష్ శంకర్ కు మళ్ళీ వెంటనే పవన్ ఎందుకు అవకాశం ఇవ్వలేదో ఎవరికీ తెలియని రహస్యం.


ఎట్టకేలకు తన కథతో మెప్పించి పవన్ తో ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీ కథను పవన్ ఆశయాలకు అనుగుణంగా ఆ కథను తయారుచేసాడు. ఆ కథ నచ్చడంతో పవన్ ఓకె చెప్పినప్పటికీ ఆ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో హరీష్ శంకర్ కు కూడ తెలియని పరిస్థితి అంటున్నారు. దీనితో హరీష్ శంకర్ కొంత అసహనానికి లోనవుతున్నాడు అంటూ గాసిప్పులు వచ్చాయి.


ఇప్పుడు ఆ గాసిప్పులకు బలం చేకూర్చే విధంగా హరీష్ శంకర్ మాటలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ఎక్కువగా యూట్యూబ్ లో వెతుక్కోవాలి అంటూ కామెంట్ చేసాడు. బయట సినిమా ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు పవన్ ను చూసిన వెంటనే అభిమానులు ఉత్సాహంతో చేసే గోల ఆపడం ఎవరితరం కాదు అంటూ అయితే పవన్ ఫంక్షన్స్ లో కంటే యూట్యూబ్ లోనే ఎక్కువగా కనిపిస్తాడు అంటూ అభిప్రాయపడ్డాడు.


అయితే ప్రస్తుతం పవన్ కేవలం టాప్ హీరో మాత్రమే కాదు అవకాశం వస్తే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవ్వాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికితోడు ఎదో ఒక సందర్భంలో పవన్ జనం మధ్యకు వెళుతున్నాడు. అలాంటి వ్యక్తిని యూట్యూబ్ స్టార్ గా హరీష్ శంకర్ ఎందుకు పోల్చాడో ఎవరికీ అర్థంకాని విషయం. ప్రస్తుతం తాను పవన్ తో తీస్తున్న సినిమా ఎప్పటికీ ప్రారంభం కాకపోవడంతో అసహనంతో ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడా లేదంటే అనుకోకుండా తన మనసులోని మాట బయటపెట్టాడా అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: