ఒక సినిమాలో ఒక పాత్రను ఒక నటుడితో నటింపజేయాలని ముందుగా ఆ చిత్ర బృందం అనుకోవడం, ఆ తర్వాత అతనికి కధను వినిపించడం, కథను విన్న తర్వాత ఆ నటుడికి ఆ కథ నచ్చకపోవడం,  లేదా ఆ సమయంలో డేట్  లు లేక లేదా అనేక కారణాల వల్ల ఒక నటుడు ఆ పాత్రను వదిలివేయడం ఆ నటుడు వదిలి వేసిన పాత్రను వేరే నటులు చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా  సాధారణంగా జరిగే విషయం.

అయితే ప్రస్తుతం విక్రమ్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగినట్లు తెలుస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా నటించిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకు వెళుతుందో మన అందరికీ తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ , సూర్య ముఖ్య పాత్రలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ పాత్రలో విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే విక్రమ్ మూవీ లో విజయ్ సేతుపతి చేసిన పాత్ర కోసం ముందుగా మరో ఇద్దరు నటులను అనుకున్నారట. ఈ విషయాన్ని మూవీ లో విజయ్‌ కు రైట్ హ్యాండ్‌గా వ్యవహారించిన జాఫర్ సాదిక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

జాఫర్ సాదిక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన పాత్ర కోసం ముందుగా ప్రభుదేవా , రాఘవ లారెన్స్ ను చిత్ర బృందం అనుకున్నారు అని, కాకపోతే చివరకు ఏమైందో తెలియదు కానీ ఆ పాత్రలో విజయ్ సేతుపతి ను మేకర్స్ తీసుకున్నారు అని తెలియజేశాడు. ఇలా ముందుగా విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర కోసం ప్రభుదేవా, రాఘవ లారెన్స్ ను అనుకున్న చిత్ర బృందం చివరగా విజయ్ సేతుపతి ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: