లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా నటించిన విక్రమ్ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విక్రమ్ సినిమా  మొదటి షో నుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. విక్రమ్  మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటించగా సూర్య  ఆ కరుణ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించాడు. ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని  కంప్లీట్ చేసుకున్న విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

తమిళనాడు లో 93.30 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాలలో 19.91 కోట్లు .
కర్ణాటక లో 16.30 కోట్లు .
కేరళ లో 24.10 కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా లో  4.85 కోట్లు .
ఓవర్ సీస్ లో 82.65 కోట్లు.

 
7 రోజులకు గాను విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 121.10 కోట్ల షేర్ , 241.11 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తున్న విక్రమ్ సినిమా ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే విక్రమ్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఆ లెక్కలతో పోలిస్తే ఇప్పటికే విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హిట్ గా నిలిచి నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: