విజయ్ దేవరకొండ హీరోగా సమంత కథానాయికగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి. ఈ సినిమా టైటిల్ పేరు వినగానే అందరు ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. అంత పెద్ద హిట్ అయిన క్లాసిక్ సినిమా టైటిల్ ను మెగా హీరో కాకుండా విజయ్ దేవరకొండ వాడుకోవడం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది. పవన్ అభిమానులు అయితే ట్రోల్ చేశారు కూడా అయితే కథకు సంబంధం ఉంది కాబట్టే ఈ సినిమా కి ఈ టైటిల్ పెట్టవలసి వచ్చింది అని చిత్ర బృందం చెబుతుంది.

ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా టైటిల్ పెట్టడానికి వెనకాల దాని వెనుక సమంత బలవంతమే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ పేరు ఖుషి అని తెలుస్తోంది. ఆమె ఓ ముస్లిం అమ్మాయి పాత్ర లో నటిస్తుందని అంటున్నారు. ఈ పాత్ర కు అంత ఇంపోర్టన్స్ ఉంది కాబట్టే ఆ పాత్రకు సమంత ఎంపిక చేశారట. సమంత పాత్ర చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుందట. అందుకే ఈ సినిమా కు ఈ టైటిల్ పెట్టవలసి వచ్చింది అంటున్నారు.

వాస్తవానికి ఈ సినిమాకు ఖుషి టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. విజయ్ అభిమానులు కూడా దీనిపట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు.  దర్శకుడు శివ నిర్వాణ కూడా ఈ టైటిల్ ఆలోచన రాగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయాలనీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వస్తున్న సినిమాఖుషి తరహాలో సంచలన విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ కూడా ఈ టైటిల్ కే మొగ్గు చూపడంతో ఈ సినిమా కి ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: