నందమూరి సింహం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన టీజర్ చుట్టూ ఇప్పుడు రాజకీయ దుమారం అలుముకోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘అఖండ’ మూవీ తరువాత విడుదల కాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై నందమూరి అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.


ఆ అంచనాలకు తగ్గట్టుగానే బాలయ్య డిఫరెంట్ గెటప్ తో పాటు మాస్ డైలాగ్స్ తో అలరిస్తున్న ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటలకే సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ నోటివెంట వచ్చిన డైలాగ్ ‘దేవుడి ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ కాదు’ అంటూ బాలయ్య స్టైల్ లో చెప్పిన డైలాగ్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన అనేక గర్నమేంట్ ఆర్డర్ల పై అనేక వివాదాలు రావడమే కాకుండా ఆ గవర్నమెంట్ ఆర్డర్లను ఛాలెంజ్ చేస్తూ చాలామంది కోర్టు మెట్ల ఎక్కిన విషయం తెలిసిందే.  


ఇప్పుడు బాలకృష్ణ నోటివెంట ఆ గవర్నమెంట్ ఆర్డర్ల విషయం రావడంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న మూవీలో పొలిటికల్ సెటైర్లు ఉంటాయా అన్న సందేహాలు చాలామందికి కల్గుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలలో నటిస్తూనే తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో బాలయ్య నోటివెంట ఏ డైలాగ్ వచ్చినా అది సినిమా డైలాగ్ లా చూడకుండా దానికి రాజకీయ కోణంలో విశ్లేషణ చేస్తున్నారు.


ఇప్పుడు ఈ లేటెస్ట్ టీజర్ పై కూడ విశ్లేషణలు ఆ స్థాయిలో వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కి పోవడంతో తెలుగుదేశం పార్టీ తిరిగి తన సత్తాను చాటుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలలో భాగంగానే బాలయ్య తన లేటెస్ట్ మూవీలో రాజకీయపు టచ్ ఇస్తున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. బాలకృష్ణ పక్కన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలయ్య ఊర మాస్ స్టెప్స్ ఉంటాయి అన్న అంచనాలతో అభిమానులు ఉన్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: