రానా సాయి పల్లవి లు కలిసి నటించిన ‘విరాటపర్వం’ మూవీ నక్సల్ నేపధ్యంలో అల్లబడిన ఒక ప్రేమ కథ. ఈ మూవీలో వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవి చేసిన అద్భుత నటనకు ఆమెకు అవార్డులు వస్తాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం అనేక ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్లు ఇచ్చినప్పటికీ ఈ మూవీ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఈ మూవీని డైరెక్టర్ గా ధియేటర్లలో విడుదల చేస్తున్నారు.


అయితే క్రితం వారం విడుదలైన సినిమాలలో ‘విక్రమ్’ కు భారీ హిట్ రావడంతో పాటు ‘మేజర్’ సినిమా కలక్షన్స్ కూడ బాగా ఉండటంతో ఈవారం విడుదల అవుతున్న ‘అంటే సుందరానికి’ కలక్షన్స్ ఏవిధంగా వస్తాయి అన్న సందేహాలు ఉన్నాయి. ఈ మూవీ పోటీని కూడ పట్టించుకోకుండా వచ్చేవారం సోలో మూవీగా ‘విరాటపర్వం’ రాబోతోంది.  


నేటితరం ప్రేక్షకులకు నక్సలైట్ ఉద్యయమం గురించి వారి త్యాగాల గురించి పెద్దగా అవగాహన లేదు. అయితే 1970-1980 ప్రాంతాలలో ఆనాటి అభ్యుదయ భావాలు ఉన్న యూత్ ను నక్సలైట్ ఉద్యమం విపరీతంగా ఆగర్శించింది. ఇప్పుడు ఈనాటితరం ప్రేక్షకులకు ఆనాటి నక్సలైట్ ఉద్యమాన్ని పరిచయం చేస్తూ తీసిన ‘విరాటపర్వం’ మూవీ విడుదల కాకుండానే ముందుగా చూసిన నిఖిల్ తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ మూవీలో సాయి పల్లవి నటనకు తన మైండ్ బ్లాంక్ అయిందని కామెంట్ చేస్తూ ఈ మూవీ తరువాత సాయి పల్లవి గురించి అందరూ మాట్లాడుకుంటారు అని అంటున్నారు.


ఈమూవీని ఇలా ప్రమోట్ చేస్తూ విడుదలకు ముందుగానే కొంతమంది హీరోలకు ఈ సినిమాను చూపించి వారి చేత రివ్యూలు వ్రాయించి ఈమూవీ పై అంచనాలు పెంచాలని మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఒక సీరియస్ ప్రేమ కథను కవితాత్మకంగా ఒక కావ్యంలా మలిచిన వెన్నెల పాత్ర విమర్శకులకు బాగా నచ్చినా వినోదాన్ని కోరుకునే సగటు ప్రేక్షకుడుకి ఎంతవరకు నచ్చుతుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: