యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా లేటెస్ట్ గా రాజమౌళి దర్సకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమురం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం మూవీపై మొదటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఉండడం, అలానే రిలీజ్ తరువాత సినిమా ఆ అంచనాలు అందుకుని అతి పెద్ద సక్సెస్ కొట్టడం జరిగింది.

బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించగా స్వరవాణి కీరవాణి సంగీతం అందించారు. ఇక హీరోలు ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి ఎంతో అత్యద్భుతంగా నటించడం, అలానే దర్శకడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ వెరసి ఆర్ఆర్ఆర్ కి అంత పెద్ద విజయం అందించాయి. అయితే విషయం ఏమిటంటే, అటు థియేటర్స్ లో అదరగొట్టిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇటీవల ఒటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇటు అందులో కూడా అదరగొట్టే వ్యూస్ దక్కించుకుంటోంది.

సినిమా ఇటీవల ఏకంగా 57 దేశాల్లోని ఓటిటి లిస్ట్ లో టాప్ స్థానంలో నిలిచి అందరినీ ఎంతో ఆశ్చర్య పరిచింది. మరోవైపు ఈ సినిమాని చూస్తున్న పలువురు హాలీవుడ్ తో పాటు ఇతర దేశాల ప్రేక్షకులు, అసలు ఆర్ ఆర్ఆర్ అనేది పాన్ ఇండియా మూవీ కాదని, ఇది పాన్ వరల్డ్ మూవీ అని, దీనిని బట్టి చూస్తుంటే రాబోయే ఆస్కార్స్ లో ఈ సినిమా విదేశీ చిత్రాల క్యాటగిరిలో నిలిచే ఛాన్స్ కూడా లేకపోలేదని అంటున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని విధాల తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా అగ్ర స్థాయికి తీసుకెళుతోంది. దీనితో హీరోలుగా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కూడా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: