లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కోలీవుడ్ క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో విజయ్ సేతుపతి,  ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటించగా సూర్య సినిమా చివర అతి తక్కువ సమయమే కనిపించిన తన గెస్ట్ రోల్ తో సినిమా విజయంలో కీలక పాత్ర ను పోషించాడు. ఈ మూవీ లో సూర్య రోలెక్స్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్  కలెక్షన్ లు దక్కుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్  రన్ ని కంప్లీట్ చేసుకున్న విక్రమ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం .

తమిళ నాడు లో  : 100.05 కోట్లు .
తెలుగు రాష్ట్రాలలో :  20.81 కోట్లు .
కర్ణాటక  : 16.55 కోట్లు .
కేరళ : 24.90 కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా లో 5.30 కోట్లు .
ఓవర్ సీస్ లో  86.40 కోట్లు ,

 
8 రోజు లకు గాను ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ మూవీ  127.50 కోట్ల షేర్ , 254.01 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది . ఇలా 8 వ రోజుతో విక్రమ్ మూవీ 250 కోట్ల కలెక్షన్ల మార్క్ ను టచ్ చేసింది . ప్రస్తుతం కూడా విక్రమ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకు పోతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: